జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషపూర్కు చెందిన సత్యనారాయణ గురువారం తన భార్య లక్ష్మితో కలిసి ద్విచక్రవాహనంపై హైదరాబాద్ నుంచి ఖిలాషపూర్కు వస్తున్నారు. వెనుక నుంచి వచ్చిన డీసీఎం వీరిని ఢీకొనడం వల్ల లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే లక్ష్మి చనిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ జనగామ ప్రాంతీయ ఆస్పత్రి ముందు... సిద్దిపేట-సూర్యాపేట రహదారిపై బైఠాయించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు... వారితో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.
న్యాయం చేయాలంటూ ఆందోళన - జనగామ జిల్లా వార్తలు
గురువారం రాత్రి జనగామ మండలం యశ్వంతపూర్ వద్ద ద్విచక్ర వాహనం, డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ ప్రాంతీయ ఆస్పత్రి ముందు ఆమె బంధువులు బైఠాయించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు... వారితో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.
న్యాయం చేయాలంటూ ఆందోళన