నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఏఐఎంఐఎం నిర్మల్ జిల్లా అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ అజీంబీన్ యహియా ఆందోళన చేపట్టారు. దిశ ఘటనలో నిందితులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలనే రంగారెడ్డి జిల్లా హిమాయత్‌నగర్‌లో మైనర్‌బాలికపై అత్యాచారానికి పాల్పడిన తెరాస నేత మధుయాదవ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు.
'మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడిని శిక్షించాలి' - నిర్మల్‌లో ఆందోళన
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన తెరాస నేత మధుయాదవ్‌ను కఠినంగా శిక్షించాలని ఏఐఎంఐఎం నిర్మల్ జిల్లా అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ అజీంబీన్ యహియా డిమాండ్ చేశారు.
'మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడిని శిక్షించాలి'
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సయ్యద్ అబ్రార్, కోఆప్షన్ సభ్యుడు మజర్, తదితరులు పాల్గొన్నారు.