తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నిషేధిత గుట్కా బ్యాగులు స్వాధీనం.. బీదర్​ నుంచి తీసుకొచ్చి విక్రయం - వరంగల్​ అర్బన్​ జిల్లా నేర వార్తలు

వరంగల్​ అర్బన్​ జిల్లాలో నిషేధిత గుట్కా బ్యాగులను టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 2 లక్షల 35 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. విక్రయిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.

prohibited-gutka-seized-by-task-force-in-warangal-urban-district
నిషేధిత గుట్కా పాకెట్లు స్వాధీనం.. బీదర్​ నుంచి తీసుకొచ్చి విక్రయం

By

Published : Oct 12, 2020, 1:51 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా మిల్స్ కాలనీ చింతల్ బస్తీలోని ఒక ఇంట్లో నిషేధిత గుట్కా బ్యాగులను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 బ్యాగుల అంబర్, 1 బ్యాగు పవర్ గుట్కాలు లభ్యమయ్యాయి. వాటి విలువ రూ. 2 లక్షల 35 వేలు ఉంటుందని తెలిపారు.

చింతల్ బస్తీకీ చెందిన ఓ మహిళ ఇంట్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. మహిళ సోదరుడు భువనగిరి జిల్లాకి చెందిన సురేష్.. బీదర్ నుంచి గుట్కా ప్యాకెట్లను పెద్ద మొత్తంలో ఇక్కడకు తీసుకువచ్చేవాడు. వీరిద్దరూ కలసి నగరంలోని దుకాణాల్లో విక్రయిస్తుండేవారు. నిందితులిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:బిహార్​ బరి: వర్చువల్​ ర్యాలీలతో నితీశ్​ ప్రచార బాట

ABOUT THE AUTHOR

...view details