తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రుణాలు ఇస్తామని రైతులను మోసం చేసిన ఫైనాన్స్‌ సంస్థ - private finance company

రుణాలు ఇస్తామని రైతులను ఓ ప్రైవేటు ఫైనాన్స్​ సంస్థ మోసం చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిందియ 170 మంది రైతుల నుంచి కోటి రూపాయలకు పైగా రైతుల నుంచి ఆ ఫైనాన్స్​ సంస్థ వసూలు చేసింది.

private finance company cheated farmers in suryapet district
రుణాలు ఇస్తామని రైతులను మోసం చేసిన ఫైనాన్స్‌ సంస్థ

By

Published : Sep 28, 2020, 5:05 AM IST

ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ రుణాలు ఇస్తామని రైతులను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో శ్రీ వెంకటేశ్వర ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరిట గత సంవత్సరం మార్చిలో కార్యాలయాన్ని ప్రారంభించారు. పంజాబ్‌లో ప్రధాన కార్యాలయం ఉందని చెప్పి తాటిపాముల గ్రామానికి చెందిన ప్రశాంత్‌ను బ్రాంచ్ మేనేజర్‌గా నియమించుకున్నారు. వ్యవసాయ భూములు, ఇండ్లకు రుణాలు , వ్యక్తి గత రుణాలు, భూములు మార్టుగేజ్ చేసుకొని రుణాలు ఇస్తామని వినియోగదారులకు చెప్పారు. మార్టుగేజ్ చేయడానికి ముందస్తుగా సర్వీసు ఛార్జీలు ఉంటాయని 4వేల నుంచి 40వేల వరకు వసూలు చేశారు. సుమారు 170 మంది వద్ద సుమారు కోటికిపైగా డబ్బులు వసూలు చేశారని బాధితులు తెలిపారు. ఒక్కరికి కూడా రుణం ఇవ్వకపోవడంతో మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details