హైదరాబాద్ రవీంద్ర భారతి వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం సృష్టించింది. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు... బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ వచ్చినా తనకు న్యాయం జరగలేదని వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు కడ్తాల్ గ్రామానికి చెందిన నాగులుగా పోలీసులు గుర్తించారు.
రవీంద్ర భారతి వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం - రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యాయత్నం
తెలంగాణ వచ్చినా నాకు అన్యాయం జరిగిందని... ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తూ రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు.
రవీంద్ర భారతి వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం