సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జాతీయ రహదారిపై రెండు బస్సుల మధ్య ఇరుక్కుని ప్రతాప్ అనే ప్రైవేటు ఉద్యోగి దుర్మరణం చెందాడు. ప్రతాప్ ఓ ప్రైవేటు బ్యాంకులో బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. రోజులాగే సోమవారం విధులకు హాజరయ్యేందుకు తన ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు.
రెండు బస్సుల మధ్య.. బ్యాంకు ఉద్యోగి మృతి.! - పటాన్‌చెరులో రోడ్డు ప్రమాదం
కార్యాలయానికి సమయానికి వెళ్లాలనే తొందర.. ఓ ఉద్యోగి ప్రాణాల్ని బలితీసుకుంది. వాహనాల రద్దీతో ఉన్న రోడ్డుపై రెండు బస్సుల మధ్య ఇరుక్కుని మృత్యువాత పడ్డాడు. పటాన్‌చెరు జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది.
ఉదయం వేళల్లో పటాన్‌చెరు ఎన్‌హెచ్ రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందు ముషీరాబాద్ బస్సు వెళుతుండగా వెనుక నుంచి బీహెచ్ఎల్ బస్సు వెళుతోంది. ఆ సమయంలో ఆ రెండు బస్సుల మధ్యకు ప్రతాప్ బైక్‌పై వచ్చాడు. ఈ క్రమంలో వెనక ఉన్న బీహెచ్ఎల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి అతడిని ఢీకొట్టింది. ముందు ఇంకో వాహనం ఉండటంతో ఎటూ తప్పించుకోలేక ప్రతాప్ బీహెచ్ఈఎల్ బస్సు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇదీ చదవండి:ఇద్దరి దారుణహత్య: బండరాళ్లతో మోది కిరాతకంగా చంపేశారు!