తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రేమ వివాహం.. కొద్దినెలల్లోనే గర్భవతి బలవన్మరణం - హైదరాబాద్​లో వరకట్న వేధింపులు

వరకట్న వేధింపులతో గర్భవతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్​ జగద్గిరిగుట్ట పరిధిలోని పాపిరెడ్డి నగర్​లో జరిగింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భర్త, అత్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

pregnant woman suicide due to dowry harassment in Hyderabad
వరకట్నం కోసం వేధింపులు... భరించలేక గర్భవతి ఆత్మహత్య

By

Published : Oct 22, 2020, 1:30 PM IST

సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన శ్రవణ్​కుమార్.. హైదరాబాద్​ జగద్గిరిగుట్టలో నివాసముంటూ ఓ జిమ్​ను నిర్వహిస్తున్నాడు. అయితే దిల్​సుఖ్​నగర్​కు చెందిన కృష్ణప్రియ అనే యువతితో ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కృష్ణప్రియ బుధవారం.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. అత్తింటి వారే చంపేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

కృష్ణప్రియ (ఫైల్​ ఫోటో)

ప్రస్తుతం ఆమె గర్భవతి అని.. గత రెండు నెలలుగా భర్త, అత్త, మామ వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారంటూ కృష్ణప్రియ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్త శ్రవణ్​కుమార్, అత్త మీనాను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

ఇదీ చదవండిఃమరో సెల్ఫీ: కరోనా ఫీజు పేరుతో వేధిస్తున్నారని వైద్యురాలి కన్నీరు

ABOUT THE AUTHOR

...view details