పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురళికి చెందిన శిరీష అనే గర్భిణి భర్త వేధింపులు తాళలేక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నెల్వాయికి చెందిన మధుకర్‌తో శిరీషకు మూడేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి భర్త నిత్యం శిరీషను వేధింపులకు గురి చేసేవాడు. కొంతకాలానికి శిరీష గర్భం దాల్చింది. మూడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెను పుట్టింట్లో వదిలేసిన భర్త మధుకర్.. నాలుగు నెలలు గడిచినా ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు. ఆమె బాగోగులు పట్టించుకోలేదు. శిరీష తండ్రి చనిపోయాడు. తల్లికి కనీసం చికిత్స కూడా చేయించే ఆర్థిక స్థోమత లేదు. పైగా దివ్యాంగురాలు.
భర్త వేధింపులు తాళలేక.. నిండు గర్భిణి ఆత్మహత్య - వివాహిత ఆత్మహత్య
భర్త పెట్టే వేధింపులు భరించలేక ఏడు నెలల గర్భిణి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో చోటు చేసుకుంది. గర్భం దాల్చినప్పుడు పుట్టింట్లో వదిలేసి వెళ్లిన భర్త.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు. దీనికి తోడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
భర్త వేధింపులు తాళలేక.. నిండు గర్భిణి ఆత్మహత్య
ఈ క్రమంలో మానసికంగా తీవ్ర ఆవేదన చెందిన శిరీష తల్లి, చెల్లెలు నిద్రిస్తున్న సమయంలో ఇంటికి వెనుకవైపు ఉన్న స్నానాల గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త పట్టించుకోకపోవడం వల్లే.. మనస్తాపం చెంది తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నదని శిరీష తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీధర్ తెలిపారు.
ఇదీ చూడండి:ఆటో నెంబర్ కారుకు అతికించారు.. పోలీసులు గుర్తు పట్టేశారు!