నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాశ్‌నగర్‌లో లైన్మెన్ కింద పనిచేసే బిల్బాయ్ రఘు.. ట్రాన్స్ఫారం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రఘు అనే యువకుడు గత కొంతకాలంగా ప్రకాష్‌నగర్‌లో ఉంటున్నారు. ఇంటింటికి విద్యుత్ బిల్లులు అందిస్తూ విద్యుత్‌శాఖలో బిల్బాయ్గా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
విద్యుదాఘాతంతో బిల్ బాయ్ మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన - lineman died at miryalguda
ట్రాన్స్ఫారం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై లైన్మెన్ కింద పని చేసే బిల్ బాయ్ మరణించిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రకాశ్‌నగర్‌లో జరిగింది. ఆదుకోవాలంటూ మృతుని కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
విద్యుదాఘాతంతో లైన్మెన్ మృతి.. తోటి ఉద్యోగుల ఆందోళన
ప్రకాష్‌నగర్‌లో కొత్తగా విద్యుత్ లైన్లు వేస్తున్నారు. అసిస్టెంట్ లైన్‌మెన్‌తో చేయించాల్సిన పనిని రఘుతో చేయించారు. అందువల్లే ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు కారణమైన కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని.. మృతుని కుటుంబానికి పరిహారం చెల్లించాలని కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
ఇదీ చదవండి:పెద్దపల్లిలో పెద్దపులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలి : అటవీ శాఖ
Last Updated : Oct 3, 2020, 12:55 PM IST