ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో ఈ నెల 22న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆషియా అనే మహిళ పథకం ప్రకారమే దొంగతనానికి పాల్పడినట్లు తేల్చారు.
పనికెళ్దామని తీసుకెళ్లింది.. ఇంటికొచ్చి లూటీ చేసింది
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఈ నెల 22న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పథకం ప్రకారమే ఆషియా అనే మహిళ దొంగతనానికి పాల్పడినట్లు తేల్చారు.
పనికెళ్దామని తీసుకెళ్లింది.. ఇంటికొచ్చి లూటీ చేసింది
ఆషియా.. తన ఇంటి ఎదురుగా ఉన్న మహిళను కూలి పనికి వెళ్దామని తీసుకెళ్లింది. అనంతరం ఇంటి దగ్గర పనుందని.. వెంటనే వస్తానని చెప్పి ఇంటికొచ్చింది. సదరు మహిళ ఇంట్లోకి చొరబడి.. నగలు, నగదు దొంగిలించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 112 గ్రాముల బంగారం, 1.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు.
ఇవీచూడండి:డ్రగ్స్ స్వాధీనం.. విద్యార్థుల అరెస్ట్