మహబూబ్ నగర్ జిల్లా దక్కూరు మండలం గార్లపాడుకు చెందిన ఉప్పుతాళ్ల రాజు హైదరాబాద్ వెళ్లాడు. నాలుగు రోజులైనా భర్త తిరిగి రాకపోవడం వల్ల భార్య మహేశ్వరి ఆందోళనకు గురయింది. దీంతో ఆమె భర్తను వెతుక్కుంటూ.. మూడేళ్ల కుమార్తెను వెంటబెట్టుకని సోమవారం హైదరాబాద్ వెళ్లింది.
హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్‌లో తన భర్త దగ్గరకు తీసుకెళ్తామని మాయమాటలు చెప్పి ఓ ముఠా ఆమెను తన కూతుర్ని భువనగిరికి తీసుకొచ్చారు. భువనగిరి బస్టాండ్‌లో ఇద్దరు నిందితులకు మరో మహిళ చేరి.. మహేశ్వరి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపింది. ఆమె స్పృహ కోల్పోయాక.. పాపను కిడ్నాప్ చేశారు.