తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

3 కిలోల బంగారం, రూ.7 లక్షలు పట్టివేత - kadapa district news

ఏపీ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ వ్యక్తి వద్ద నుంచి భారీ ఎత్తున బంగారం, వెండి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ కోటిన్నర ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

3 కిలోల బంగారం, రూ.7 లక్షలు పట్టివేత
3 కిలోల బంగారం, రూ.7 లక్షలు పట్టివేత

By

Published : Feb 3, 2021, 8:09 AM IST

ఆంధ్రప్రదేశ్​ కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ ఎత్తున బంగారం, వెండి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సినీహబ్‌ దగ్గర ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో గ్రామీణ పోలీసు స్టేషన్‌ ఎస్సై లక్ష్మీనారాయణ అతడిని తనిఖీ చేశారు. ఎలాంటి బిల్లులు లేని సుమారు 2.9 కిలోల బంగారంతో పాటు, రూ.7లక్షలు నగదును గుర్తించారు. బంగారం విలువ కోటిన్నర ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. బంగారంతో ఉన్న వ్యక్తి హైదరాబాద్ వాసిగా పోలీసులు గుర్తించారు.

కొత్తపల్లి చెక్ పోస్టు వద్ద తనిఖీలు..

కడపకు చెందిన మరో వ్యక్తి వద్ద కొత్తపల్లి చెక్‌పోస్టు దగ్గర పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి బిల్లులు లేని 5 కిలోల వెండి, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం, వెండి బయటపడటంతో పోలీసులు వారిని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:‘సలార్‌’ చిత్ర యూనిట్‌ వ్యాన్‌ను ఢీకొన్న లారీ

ABOUT THE AUTHOR

...view details