కరీంనగర్ జిల్లా కేశవపట్నం పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. రూ.5.38 లక్షల విలువ చేసే కిలో గంజాయితోపాటు 700 ప్యాకెట్ల అంబర్‌ను పట్టుకున్నారు. అదే రోజు కేశవపట్నం మండలం కన్నాపూర్‌లోని ఓ కిరాణం దుకాణంలో పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.26,250 వేల విలువ చేసే అంబర్ ప్యాకెట్లను పట్టుకున్నారు. దుకాణ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు గంగాధర గ్రామంలో వినయ్‌కుమార్ కిరాణంలో తనిఖీలు చేపట్టగా రూ.75వేల విలువ చేసే అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
రూ.5.38 లక్షల విలువ చేసే గంజాయిని పట్టుకున్న పోలీసులు
కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కరీంనగర్ జిల్లా కేశవపట్నం పోలీసులు పట్టుకున్నారు. రూ.5.38 లక్షల విలువ చేసే కిలో గంజాయితోపాటు 700 ప్యాకెట్ల అంబర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
రూ.5.38 లక్షల విలువ చేసే గంజాయిని పట్టుకున్న పోలీసులు
తాడికల్ గ్రామంలో ఓ వ్యక్తి సంచితో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. అతని వద్ద రూ.18,750 వేల విలువ చేసే అంబర్ ప్యాకెట్లను పట్టుకున్నట్లు గ్రామీణ సీఐ ఎర్రల కిరణ్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హుజూరాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు సీఐ, ఎస్సైలను ఏసీపీ అభినందించారు. పొగాకు ఉత్పత్తుల విక్రయంపై పక్కా నిఘా ఉంచామన్నారు.
ఇదీ చదవండి:పీడీఎస్ బియ్యం స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్