పెట్రోల్ బంకుల్లో మోసపూరిత చిప్‌లు అమర్చి యధేచ్ఛగా మోసాలకు పాల్పడిన ముఠా సూత్రధారి శిబు థామస్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులకు కొత్తేమీ కాదు. సంవత్సరాలుగా ఇతను పెట్రోల్ బంకులకు చిప్‌లను సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ముంబయి నుంచి చిప్‌లు విక్రయించింది ఇతనే అని పోలీసులు దర్యాప్తులో బయటపడినా... నిందితుడిని ఇంకా పట్టుకోలేకపోయారు. ఇదే తరహాలో మోసాలకు పాల్పడిన శిబు థామస్ 2014 లో ఎస్వోటీ బృందానికి దొరికిపోయాడు. ఆ తర్వాత ఈ వ్యవహారం మరుగున పడడం వల్ల... తిరిగి తన మోసాలు కొనసాగించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెట్రోల్ బంక్‌ల యజమానులకు చిప్‌లను విక్రియించడం చూస్తుంటే... ఈ మోసాల్లో మునిగి తేలుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
నకిలీ సాఫ్ట్‌వేర్‌తో..
చూసేందుకు నిర్ణీత పరిమాణంగా కనిపిస్తూనే తక్కువ మోతాదులో ఇంధనం విడుదల చేసేలా మోసపూరిత చిప్‌లను తయారు చేయడంలో శిబు థామస్ సిద్ధహస్తుడు. కేరళలోని అలెప్పీకి చెందిన ఈ మోసగాడు... ఎనిమిదో తరగతి వరకు చదివాడు. దాదాపు 25 ఏళ్ల క్రితం ముంబయి వలస వెళ్లాడు. పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన వివిధ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ... 2013 లో హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ సర్వీసులో మెకానిక్‌గా చేరాడు. అదే సమయంలో పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపే యంత్రాల గురించి క్షుణంగా తెలుసుకున్నాడు. నకాలీ సాఫ్ట్‌వేర్ అమర్చి అడ్డదారిలో సంపాదించే కుట్రకు తెర తీశాడు. ముంబాయి కి చెందిన వికాస్‌శెట్టిని సంప్రదించి ఆ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు.
విలాసవంతమైన జీవితం..