వెల్దండ మండలంలోని నాటు సారా తయారు చేస్తొన్న ప్రాంతాల్లో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిచారు. వెంకటయ్య అనే వ్యక్తి పొలంలో నాటు సారా కాస్తున్నారని గ్రామ కార్యదర్శి సమాచారంతో పోలీసులు పోలాల్లో సోదాలు నిర్వహించారు. భూమిలో పాతి పెట్టిన డ్రమ్ములో 200 లీటర్ల బెల్లం పానకం, 30 కిలోల పట్టిక, రెండు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. బట్టీలు నిర్వహించే వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.
నాటుసారా బట్టీలపై పోలీసుల దాడి - నాగర్ కర్నూల్ జిల్లా వార్తలు
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో యథేచ్ఛగా నాటుసారా కాస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఎకకాలంలో బట్టీలపై దాడులు నిర్వహించారు.
నాటుసారా బట్టీలపై పోలీసుల దాడి