తెలంగాణ

telangana

By

Published : Nov 14, 2020, 10:22 AM IST

ETV Bharat / jagte-raho

ఇసుక మాఫియా: పోలీసులు, స్థానికులకు ఘర్షణ

కరీంనగర్ జిల్లా బొమ్మకల్​లో అర్ధరాత్రి వేళ ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు మానేరు నది వద్దకు చేరుకున్నారు. ఫలితంగా స్థానికులు, పోలీసులకు ఘర్షణ జరిగింది. ఆకుల రవి అనే వ్యక్తితో పాటు మరికొందరు హోంగార్డు ప్రభాకర్​పై దాడి చేశారనే ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

police ride on sand mafia at bommakal in karimnagar
ఇసుక మాఫియా: పోలీసులు, స్థానికులకు ఘర్షణ

ఇసుక మాఫియా విషయంలో పోలీసులకు, స్థానికులకు మధ్య ఘర్షణ నెలకొంది. కరీంనగర్‌ రూరల్‌ మండలం బొమ్మకల్‌ తీగల వంతెన మానేరు నది సమీపంలో పోలీసులకు స్థానికులు ఎదురుతిరిగారు. బొమ్మకల్‌లో ఇసుకను అర్ధరాత్రి తరలిస్తుండగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పలువురు కార్పొరేటర్ల అనుచరులు ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు విచారించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

రాత్రి విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది మానేరు వాగులోకి వెళ్లి వారిని ఆపే ప్రయత్నం చేయగా ఓ కార్పొరేటర్‌ కుమారుడు నేనెవరో తెలుసా అంటూ కానిస్టేబుల్​ను ప్రశ్నించారు. ఇరు వర్గాల వాగ్వాదం వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఆకుల రవితో పాటు కొందరు యువకులు కలిసి హోంగార్డు ప్రభాకర్‌ పై దాడి చేసి పరారయ్యారు. పోలీసులకు ఎదురు తిరిగి విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఠాణా ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

ఇదీ చదవండి:కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయాలి: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details