సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్లో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో మహిళ భర్తే నిందితుడని డీఎస్పీ సత్యనారాయణ రాజు వెల్లడించారు. జుర్రు సాయిలు, అనసూయకు 1996లో వివాహం జరిగింది. వారికి 21 ఏళ్ల అబ్బాయి ఉండగా, ఒక కూతురు పుట్టి మూడేళ్ళ వయస్సులో చనిపోయింది. కొన్నాళ్ళకు తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని సాయిలు అనుమానించసాగాడు.
తలామొండెం వేరుచేసి... తలను మాత్రం అతని ఇంటి వద్ద పారేశాడు...! - sangareddy news
తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానించిన భర్త పథకం రచించాడు. రాత్రి పూట భార్య తలపై బలంగా కొట్టాడు. స్పృహ కోల్పోగానే... ఊరి మధ్యలోకి తీసుకెళ్లి తలామొండెం వేరు చేశాడు. తలను తనకు అనుమానం ఉన్న వ్యక్తి ఇంటి వద్ద విసిరేశాడు.
అనంతరం వారి మధ్య మనస్పర్థలు తలెత్తి విడిగా ఉన్నారు. పెద్దమనుషుల ఒప్పందంపై కొంత కాలం మళ్ళీ కలసి ఉన్నారు. అయినా ఆమె ప్రవర్తన మారక పోవటం వల్ల భార్యతో దూరం పెంచుకున్నాడు. కుమారుడు శ్రీకాంత్తో కలిసి అనసూయ హైదరాబాద్లో ఉంటోంది. ఈ క్రమంలోనే నిందితుడు భార్యను అంతమొందించడానికి పథకం వేసుకున్నాడు. నెల క్రితం హైదరాబాద్ వెళ్లి కలిసి ఉందామని నమ్మించి గ్రామానికి తీసుకొచ్చుకున్నాడు.
భార్యను చంపడానికి ఆదును కోసం చూశాడు. అప్పటికే పదునైన కత్తి ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. 14న రాత్రి సమయంలో బాత్రూంకు వెళ్ళి రాగానే తలపై కర్రతో కొట్టాడు. స్పృహ కోల్పోయిన అనసూయను వారి ఇంటి వెనక ద్వారం నుంచి ఊరు మధ్యలోని ఖాళీ స్థలానికి తీసుకెళ్ళాడు. కత్తితో తలను మొండెం నుంచి వేరు చేశాడు. మొండెంను అక్కడే వదిలి తలను... నారాయణఖేడ్ తీసుకెెళ్లి... వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి అద్దె ఇంటి వద్ద విసిరేశాడు. అనంతరం పారిపోవాలని చూసి పోలీసులకు దొరికిపోయాడు.