ఆంద్రా - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కటాఫ్ ఏరియాలోని జొడొంబో పోలీసు స్టేషన్ పరిధిలోని అరపదర్ - ఆండ్రాపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను గుర్తించారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మావోయిస్టు డంప్ స్వాధీనం
ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో గాలింపు చేపట్టిన బీఎస్ఎఫ్, ఒడిశా పోలీసులు.. భారీ మావోయిస్టు డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. జొడొంబో పోలీసు స్టేషన్ పరిధిలోని అరపదర్ - ఆండ్రాపల్లి అటవీ ప్రాంతంలో ఈ డంప్‌ను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో భారీ మావోయిస్టు డంప్ స్వాధీనం
రెండు మందు పాతరలు, 14 హ్యాండ్ గ్రైనేడ్‌లు, 13 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 9 ఎంఎం పిస్టల్‌కు చెందిన 55 రౌండ్స్, 303 తుపాకీకి చెందిన 93 రౌండ్ల బుల్లెట్లు ఉన్నట్లు ఒడిశా మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేష్ కిల్లారి తెలిపారు. ఎస్‌జడ్‌సీ మావోయిస్టులకు చెందిన డంప్‌గా గుర్తించామని వెల్లడించారు.
ఇదీ చదవండి:గుప్త నిధుల తవ్వకాలకు యత్నం...అరెస్ట్ చేసిన పోలీసులు