మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బొడ్డితండా, బక్కతండా, ఫకీరాతండా, వెంక్యాతండా, దాసుతండాల్లోని గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్, సివిల్ పోలీసుల దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో 35 లీటర్ల గుడుంబా, 275 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
గుడుంబా స్థావరాలపై దాడులు... 9 మంది అరెస్టు - మహబూబాబాద్ జిల్లాలో అక్రమగుడుంబా స్థావరం
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని గుడుంబా స్థావరాలపై పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తయారు చేస్తున్న గుడుంబా, బెల్లం ద్రావణాన్ని ధ్వంసం చేసి 9మందిపై కేసులు నమోదు చేశారు.
అక్రమ గుడుంబా స్థావరంపై ఎక్సైజ్ దాడులు... 9మంది అరెస్టు
97 కిలోల నల్లబెల్లం, ఐదు కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గుడుంబా తయారీకి పాల్పడుతున్న 9 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆబ్కారీ సీఐ లావణ్యసంధ్య తెలిపారు.
ఇదీ చూడండి:అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రి సీజ్