యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో పేకాట స్థావరంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సాంబశివ ఎరువుల దుకాణంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.16,645 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 5 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వలిగొండ ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ తెలిపారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్ - తెలంగాణ వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో పేకాట స్థావరంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగురు ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.16,645 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 5 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి