చెల్లెలి కుమారుడి మరణం తట్టుకోలేక పెద్దమ్మ గుండె పోటుతో మృతి చెందిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని చితలపాళెంలో జరిగింది. చింతలపాళెంలో కొద్ది రోజులుగా రైతులు, షీకారుల మధ్య వివాదం జరుగుతోంది.
చెల్లెలి కుమారుడి మరణం తట్టుకోలేక మహిళ మృతి - శ్రీకాళ హస్తి తాజా మరణ వార్తలు
ఏపీలోని చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని చితలపాళెంలో విషాదం నెలకొంది. చెల్లెలి కుమారుడి మరణ వార్త విని ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
చెల్లెలి కుమారుడి మరణం తట్టుకోలేక మహిళ మృతి
ఈ వివాదంలో ఇటీవల కాలంలో షికారీకి చెందిన బబ్లీ(36)హత్యకు గురయ్యారు. ఈ మరణ వార్త విని శ్రీకాళహస్తి మండలంలోని ఎంపెడు ఈశ్వరయ్య కాలనీకి చెందిన బబ్లీ పెద్దమ్మ సరోజమ్మ(70) గుండె పోటుతో మృతి చెందారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఏఎస్పీ ముని రామయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.