ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని ఏజెన్సీ గ్రామాల నుంచి అక్రమంగా తరలిస్తున్న గోమాతలను గోవిందరావుపేట మండలం ఏబీవీపీ, కిసాన్ మోర్చా నాయకులు అడ్డుకున్నారు. ఏటూరు నాగారం నుంచి హైదరాబాద్‌కి తీసుకెళ్తున్న ఆవులను అడ్డుకొని పస్ర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ములుగులో గోవుల అక్రమ రవాణా... - ములుగు జిల్లా లేటెస్ట్ న్యూస్
ములుగు జిల్లాలో గోమాతలను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఏటూరు నాగారం మండలంలోని ఏజెన్సీ గ్రామాల నుంచి తరలిస్తున్న రెండు వాహనాలను సీజ్ చేశారు. ఏబీవీపీ, కిసాన్ మోర్చా నాయకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ములుగులో గోమాతల అక్రమ రవాణా...
రెండు వాహనాల్లో ఆవులను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి టి దేవేందర్ రావు, ములుగు జిల్లా భాజపా కార్యదర్శి కర్ర సాంబశివుడు, బీజేవైఎం జనార్దన్, కిరణ్, మెరుగు మణికంఠ తదితరులు పాల్గొన్నారు.