యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పేకాట స్థావరంపై భువనగిరి ఎస్వోటీ, ఆత్మకూర్ పోలీసులు గురువారం సాయంత్రం సంయుక్తంగా దాడి నిర్వహించారు. 7 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు.. 7 మంది అరెస్ట్ - yadadri district latest news
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పేకాట ఆడుతున్న 7 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.61,210 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, 8 చరవాణులు, 5 సెట్ల పేకలను స్వాధీనం చేసుకున్నారు.
మండల కేంద్రంలోని జేఏఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆత్మకూర్ మండలానికి చెందిన కొసన శ్రీశైలం, బూడిద కృష్ణ, ఎలగందుల స్వామి, గడ్డం వెంకట్, పల్లపు రాజు, భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన పల్లెపాటి లింగం, మోటకొండూరు మండలం నాంచారిపేటకు చెందిన గంగదారి నర్సింహను అదుపులోకి తీసుకున్నట్లు ఆత్మకూర్ ఎస్సై ఎం.డి.ఇద్రీస్ అలీ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.61,210 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, 8 చరవాణులు, 5 సెట్ల పేకలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
TAGGED:
yadadri district latest news