హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ పేకాట స్థావరంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న వివిధ రంగాలకు చెందిన 11 మంది వ్యాపారస్తులను అదుపులోకి తీసుకున్నారు.
పేకాట స్థావరంపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు - పేకాట స్థావరం
పేకాట స్థావరంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పేకాట ఆడుతున్న వివిధ రంగాలకు చెందిన వ్యాపారస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పేకాట స్థావరంపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు
వీరిలో నలుగురు మహిళలు కాగా ఏడుగురు పురుషులు ఉన్నారు. వీరి నుంచి సెల్‌ఫోన్లు, 3 లక్షల 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం వీరందరిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.
ఇదీ చదవండి:జంగంపల్లి గ్రామంలో పేలుడు సామాగ్రి స్వాధీనం