ముగ్గురు అంతర్ జిల్లా వాహన దొంగల ముఠాపై కరీంనగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కుమ్మరి రాజు, కత్తుల ప్రశాంత్, కొండపల్లి చిన్నయ్యపై నమోదు చేసినట్లు కమిషనర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు.
అంతర్ జిల్లా వాహన దొంగల ముఠాపై పీడీ యాక్ట్ - Karimnagar District Latest News
ముగ్గురు అంతర్ జిల్లా వాహన దొంగల ముఠాపై కరీంనగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. 42 ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ఇలాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
![అంతర్ జిల్లా వాహన దొంగల ముఠాపై పీడీ యాక్ట్ PD Act on a gang of three inter-district vehicle thieves](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10517332-852-10517332-1612559156058.jpg)
ముగ్గురు అంతర్ జిల్లా వాహన దొంగల ముఠాపై పీడీ యాక్ట్
2020లో కరీంనగర్, నిజామాబాద్, మేడ్చల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో 42 ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. వీరిపై నేటి నుంచి పీడీ యాక్ట్ అమలవుతుందన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:లైవ్ వీడియో: హోం గార్డ్‌ను ఢీ కొట్టిన బైక్ రైడర్