తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అడ్డుకట్ట వేయాల్సిన వారే.. అండగా నిలుస్తున్నారు! - kamareddy police involves in sand mafia

ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే సహకారమందిస్తున్నారని కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండలంలో ఇసుక దందా చేసే ఓ వ్యక్తి ఆరోపించాడు. తన వద్ద డబ్బు తీసుకున్న అధికారుల పేర్లను బహిర్గతం చేశాడు.

police helps sand mafia in kamareddy district
ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల హస్తం

By

Published : May 1, 2020, 4:33 PM IST

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్ మంజీరా నది నుంచి కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. స్థానిక పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ ఇసుక దందాకు పూర్తి సహకారం అందిస్తున్నారని ఇసుక దందా చేసే రాములు ఆరోపించాడు.

పోలీసుల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని రాములు తెలిపాడు. తన వద్ద డబ్బులు తీసుకున్న సిబ్బంది పేర్లను బహిర్గతం చేశాడు. రాత్రి వేళలో పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది.. డబ్బులు, మందు, విందు ఇవ్వాలని చరవాణిలో మాట్లాడిన సంభాషణలను వైరల్ చేశాడు. ఇసుక దందాలో ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కానిస్టేబుళ్ల మాటలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ఈ విషయంలో ఓ కానిస్టేబుల్​ను పోలీసు అధికారులు సస్పెండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details