హైదరాబాద్‌లో ఈనెల 22న కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల బాలుడి కేసును సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. క్షేమంగా షేక్ అబ్దుల్ వహాబ్ని తన తల్లికి అప్పగించి... నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
భాగ్యనగరంలోని పాతబస్తి ఫలక్ నుమా ప్రాంతానికి చెందిన ఓ మహిళ వైద్యం కోసం తన చిన్నారితో కలిసి జహనుమా ప్రాంతములోని ప్రైవేట్ క్లీనిక్‌కి వెళ్లింది. మహిళ క్లినిక్‌లో ఉండగా చిన్నారి ఆసుపత్రి బయట ఆడుకుంటున్నాడు. కొద్ది సమయం తర్వాత తల్లి బయటికి వచ్చి చూస్తే చిన్నారి కనిపించలేదు. వెంటనే చుట్టు పక్కన ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపొవడం వల్ల పోలీసులను ఆశ్రయించారు.