రసీదు లేని 12 లక్షల రూపాయల విలువచేసే 20 కిలోల వెండి ఆభరణాలతో పాటు లక్ష రూపాయల నగదును ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప ఒకటో పట్టణ పోలీస్ సేష్టన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి సమయంలో లాడ్జిలను ఆకస్మికంగా తనిఖీ చేస్తుండగా... నగరంలోని శ్రీనివాస లాడ్జిలో తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన నందకిషోర్...ఈ నగదుతో కనిపించారు.
లాడ్జిలో... 20కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం - కడపలో వెండి ఆభరణాలు స్వాధీనం
రసీదు లేని 12 లక్షల రూపాయల విలువచేసే 20 కిలోల వెండి ఆభరణాలను ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప పట్టణంలో లాడ్జిలను ఆకస్మికంగా తనిఖీ చేస్తుండగా ఈ విషయం బయటపడింది. ఆభరణాలను స్వాధీన పరచుకుని వాటిని ఆదాయ పన్ను శాఖ వారికి అప్పగించారు.
![లాడ్జిలో... 20కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం police-have-seized-jewelery-worth-rs-12-lakh-without-a-receipt-from-kadapa-okato-town-police-station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9386866-1023-9386866-1604203144243.jpg)
లాడ్జిలో... 20కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం
ఆభరణాలకు సంబంధించిన రసీదులు చూపించాలని పోలీసులు అడిగారు. కానీ అతని వద్ద ఎలాంటి రసీదులు లేకపోవడం వల్ల ...వాటిని స్వాధీన పరచుకుని ఆదాయ పన్ను శాఖ వారికి అప్పగించారు. రసీదులు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని అన్నారు. ఎవరైనా ఆభరణాలు విక్రయించాలంటే రసీదులు తప్పనిసరిగా ఉండాలని లేదంటే కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
ఇదీ చూడండి:తాగినమైకంలో ఏటీఎం చోరీకి యత్నం... స్థానికుల దేహశుద్ధి