ఆంధ్రప్రదేశ్ విజయవాడ యువతి దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగేంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారమే దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో పలు అంశాలను గుర్తించారు. ఘటనకు కొద్దిసేపటి ముందు తన స్నేహితుడికి నిందితుడు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని కూడా విచారించిన పోలీసులు ఆసక్తికర విషయాలను తెలుసుకున్నట్టు సమాచారం.
హత్య జరిగే ముందు తనకు నాగేంద్ర ఫోన్ చేశాడని.. కాసేపటిలో దివ్య తేజస్విని ఇంటి దగ్గరకు రావాలని తెలిపినట్లు అతను పోలీసులకు తెలిపాడు. అయితే తాను వచ్చేసరికే గాయపడిన దివ్యను ఆసుపత్రికి తరలించేందుకు కిందకు తీసుకు వస్తున్నారని.. లోపలికి వెళ్లి చూస్తే నాగేంద్ర కూడా రక్తపు మడుగులో ఉన్నాడని అతను పోలీసులకు చెప్పాడు.