తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రెండు తులాల బంగారు గుండ్లు కేసును ఛేదించిన పోలీసులు - నిజామాబాద్​ అంగడిలో బంగారం మర్చిపోయిన కేసు తాజా వార్త

నిజామాబాద్​ నగరంలోని వారంతపు అంగడిలో ఓ వృద్ధురాలు పోగొట్టుకున్న రెండు తులాల బంగారం గుండ్లు కేసును పోలీసులు ఛేదించారు. వాటిని తీసుకెళ్లిన మరో మహిళను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఆమె నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Police have cracked a case of forgotten gold at Nizamabad Weekly Market
రెండు తులాల బంగారు గుండ్లు కేసును ఛేదించిన పోలీసులు

By

Published : Oct 21, 2020, 8:09 AM IST

నిజామాబాద్ నగరంలోని వీక్లీ మార్కెట్​లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. డిచ్​పల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన చింతకుంట నర్సుబాయి వృద్ధురాలు సోమవారం మధ్యాహ్నం అంగడి చేయడానికై మార్కెట్​కు వచ్చి ఓ దుకాణం వద్ద సంచి మర్చిపోయి వెళ్లింది. కాగా కొద్దిసేపటి గుర్తొచ్చి చూస్తే అక్కడ ఆ సంచి కనిపించలేదని దానిలో రెండు తులాల బంగారు గుండ్లు ఉన్నావని వన్​టౌన్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

వెంటనే స్పందించిన నిజామాబాద్ వన్​టౌన్​ ఎస్సై సాయినాథ్​ ఘటనాస్థలానికి వెళ్లి దుకాణం వద్ద ఎంక్వయిరీ చేశారు. కాగా తన షాపులో ఓపెద్దమనిషి సంచి మర్చిపోయిందని ఆమెను ఎంత పిలిచినా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయిందని.. తన వెనకాలే అదేరంగు చీరకట్టుకున్న మరో మహిళవస్తే తనదే అనుకుని ఆమెకు ఇస్తే తీసుకుని వెళ్లిందని దుకాణదారు తెలిపింది. ఆమె వివరాలు తనకు తెలియదు చెప్పింది. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు... ఆ మహిళ ఒక ఆటో ఎక్కిందని గమనించారు. ఆటో వాళ్లందరని విచారించగా.. చివరకు ఆమె మంచిప్ప గ్రామానికి చెందినదిగా గుర్తించి.. తన వద్ద నుంచి 2 తులాల బంగారు గుండ్లు స్వాధీనం చేసుకుని నార్సుబాయికి అప్పగించారు.

ఇదీ చూడండి:ఆ నేపాలీల కోసం 8 బృందాలతో గాలింపు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details