తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తాళం వేసిన ఇళ్లలో చోరీలు.. ఇద్దరు దొంగల అరెస్ట్ - telangana news

రాత్రివేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా.. చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలని హయత్​నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

Police have arrested two interstate thieves in Hayat Nagar, Rangareddy district
తాళం వేసిన ఇళ్లలో చోరీలు.. ఇద్దరు దొంగల అరెస్ట్

By

Published : Jan 13, 2021, 7:38 AM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ. 8.3లక్షల విలువైన 11తులాల బంగారు, 128తులాల వెండి ఆభరణాలతో పాటు రెండు ఎల్​ఈడీ టీవీలు, ఓ ద్విచక్ర వాహనం, రూ.23వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్​ ప్రీత్​ సింగ్ తెలిపారు.

నిందితులు షేక్ రఫీ, నవీన్​లు.. తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకొని ఈ దొంగతనాలకు పాల్పడిన్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితులపై ఒక్క రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే 10చోరీ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. కాలనీలలో ఎవరైనా అనుమానస్పందంగా కనిపిస్తే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ సూచించారు.

ఇదీ చదవండి:తాళాలు పగలగొట్టి .. బాధ్యతలు అప్పజెప్పారు

ABOUT THE AUTHOR

...view details