తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జోరుగా సాగుతున్న క్రికెట్​ బెట్టింగ్​.. ఏడుగురు అరెస్టు - హైదరాబాద్​లో క్రికెట్​ బెట్టింగ్​ తాజా వార్త

జైపూర్ కేంద్రంగా హైదరాబాద్​లో క్రికెట్ బెట్టింగ్ జోరుగా కొనసాగుతుంది. విషయం తెలుసుకున్న రాజస్థాన్​ పోలీసులు.. సైబరాబాద్ పోలీసుల సాయంతో ఏడుగురిని పట్టుకున్నారు.

Police have arrested seven people for betting on cricket in Hyderabad
జోరుగా సాగుతున్న క్రికెట్​ బెట్టింగ్​.. ఏడుగురు అరెస్టు

By

Published : Oct 13, 2020, 12:46 AM IST

జైపూర్​ కేంద్రంగా హైదరాబాద్​లో క్రికెట్​బెట్టింగ్ కొనసాగుతోంది. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన రాజస్థాన్​ పోలీసులు జైపూర్​లోని ప్రధాన బుక్కీని అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా హైదరాబాద్​ గచ్చిబౌలిలోని మరికొందరి బుక్కీల వివరాలు తెలుకున్నారు. స్థానిక పోలీసుల సాయంతో బెట్టింగ్ స్థావరంపై దాడులు నిర్వహించిన రాజస్థాన్ పోలీసుల ఏడుగురు నిందితులు అదుపులోకి తీసుకున్నారు.

జైపూర్ కేంద్రంగా కమిషన్ ద్వారా హైదరాబాద్​తో పాటు బెంగళూరు, ముంబయి, దిల్లీలో మరికొంతమంది బుక్కీలను ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్ ద్వారా పుంటర్ల నుంచి నగదు బదిలీలు జరుగుతున్నట్లు వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకుని 65వేల నగదు, 4ల్యాప్ టాప్​లు, 46 చరవాణులు, 6ల్యాండ్ ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:'చాక్ పీస్​లు తినొద్దన్నందుకు ఆత్మహత్య చేసుకుంది'

ABOUT THE AUTHOR

...view details