తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జంట హత్యల కేసులో నిందితుల గుర్తింపు - హైదరాబాద్​ వార్తలు

హైదరాబాద్​ లంగర్‌హౌస్​ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రాత్రి జరిగిన జంట హత్యల కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశ్వక్‌ గ్యాంగ్​ ఈ హత్యలకు పాల్పడినట్లు గుర్తించారు.

police find out Accused in double murder case in hyderabad
జంట హత్యల కేసులో నిందితుల గుర్తింపు

By

Published : Jun 6, 2020, 12:04 PM IST

Updated : Jun 6, 2020, 12:12 PM IST

లంగర్‌హౌస్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన జంట హత్యల కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి రౌడీ షీటర్‌ చాందీ మహ్మాద్‌, ఫయాజుద్ధీన్‌ అలియాస్‌ అబు బైక్​పై వెళ్తున్నారు. ఆలివ్‌ ఆసుపత్రి సమీపంలో క్వాలిస్‌తో వారిని ఢీకొట్టిన దుండగులు అనంతరం కత్తులతో పొడిచి హత్య చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. అశ్వక్‌ గ్యాంగే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కారులో నలుగురు, ద్విచక్ర వాహనంపై ఇద్దరు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో హత్యలు చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:నిధుల సమీకరణపై టాటా గ్రూప్ కీలక ప్రకటన

Last Updated : Jun 6, 2020, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details