ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను కస్టడీలోకి ఇవ్వాలని బోయిన్పల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బాలచెన్నయ్య, మల్లికార్జున్ రెడ్డి, సంపత్‌లను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని సికింద్రాబాద్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ముగ్గురు నిందితులను ఈ నెల 11న పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.
కిడ్నాప్ కేసు: మరో ముగ్గురి కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ - hyderabad latest news
బోయిన్పల్లి కేసులో మరో ముగ్గురు నిందితులను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కస్టడీ పిటిషన్‌పై పోలీసుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.
![కిడ్నాప్ కేసు: మరో ముగ్గురి కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ police filed custody petition in secunderabad court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10286564-964-10286564-1610968979409.jpg)
అపహరణలో భాగంగా నిందితులు మియాపూర్‌లోని ఓ మొబైల్ దుకాణంలో 6 చరవాణీలు కొనుగోలు చేసి... వాటితోనే సంభాషణలు కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అపహరణ కంటే ముందు ప్రవీణ్‌రావు ఇంటి చుట్టూ నిందితులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో పురోగతి కోసం నిందితులను ప్రశ్నించాల్సి ఉందని... కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశముందని పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి:అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం