బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పరారీలో ఉన్న విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. భూవివాదానికి సంబంధించి ముగ్గురు సోదరులను అపహరించిన కేసులో బాధితులను విఖ్యాత్ రెడ్డి తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారని తెలిపారు.
జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. పరారీలో ఉన్న అతనికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు.
జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు
ఈ కేసుతో విఖ్యాత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది ముందస్తు బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. దర్యాప్తునకు విఖ్యాత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తారని న్యాయవాది పేర్కొన్నారు. వాదనను సికింద్రాబాద్ న్యాయస్థానం ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : సభాపతి
Last Updated : Jan 25, 2021, 6:07 PM IST