తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యంతో పోలీసులు ఏకంగా పోలీసు స్టేషన్లోనే విందు చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. కర్ణాటక నుంచి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని హిందూపురం రెండో పట్టణ పోలీసులు 15 రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం పోలీసు స్టేషన్లోనే ఉంచగా.. దాని నుంచి కొన్ని మద్యం సీసాలు తీసుకొని ఓ గదిలో విందు చేసుకున్నారు.
పోలీసులు మద్యం సేవిస్తోన్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై డీఎస్పీ మహబూబ్ బాషాను అడగ్గా ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు.