తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రియల్టర్​ హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు - Telangana news

రాజేంద్రనగర్‌ పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగిన రియల్టర్‌ హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు షేక్‌ రషీద్‌, మొహమ్మద్ అజ్మత్‌, సయ్యద్ ఇమ్రాన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు శంషాబాద్​ డీసీపీ ప్రకాశ్​రెడ్డి పేర్కొన్నారు

రియల్టర్​ హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
రియల్టర్​ హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

By

Published : Jan 11, 2021, 9:51 PM IST

హైదరాబాద్ రాజేంద్రనగర్‌ పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగిన రియల్టర్‌ హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించినట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్​ రెడ్డి తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు షేక్‌ రషీద్‌, మొహమ్మద్ అజ్మత్‌, సయ్యద్ ఇమ్రాన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ పేర్కొన్నారు.

మృతుడు ఎంఎం పహాడి రాజేంద్రనగర్‌కు చెందిన మొహమ్మద్ ఖాజా ఖలీల్‌ స్తిరాస్థి వ్యాపారంతో పాటు వడ్డీలకు రుణాలు ఇస్తుంటాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో హోటల్‌ నిర్వహించే షేక్ రషీద్‌ కొన్నాళ్ల క్రితం ఖాజా ఖలీల్‌ వద్ద రూ. 15 లక్షలు అప్పు తీసుకున్నాడు. కొవిడ్‌- 19 లాక్‌డౌన్ నేపథ్యంలో హోటల్‌ నడవక నష్టాలు వచ్చాయి. రషీద్‌ మరికొందరి వద్ద కూడా అప్పులు చేశాడని డీసీపీ పేర్కొన్నారు. నెలనెలా రూ. 60వేల చొప్పున రుణం తీర్చాలని మృతుడు రషీద్‌ను కోరాడని... అయితే మరో రూ. 50 లక్షలు ఇస్తే ఇతరుల వద్ద తీసుకున్న రుణాలు తీర్చి తర్వాత నీకు ఇస్తానని ఖలీల్‌కు చెప్పాడని డీసీపీ తెలిపారు.

ఆ హోటల్‌ను తనకు రాసిస్తే రూ. 50 లక్షలు రాసిస్తానని చెప్పగా... ఈ క్రమంలో వీరిద్దరి మధ్య కొంత గొడవ జరిగిందని డీసీపీ పేర్కొన్నారు. హోటల్‌ వద్ద గొడవ జరగడం వల్ల మనస్తాపానికి గురైన రషీద్‌... ఖలీల్‌ను హతమార్చాడానికి తన వర్కర్లు మొహమ్మద్ అజ్మత్‌, సయ్యద్ ఇమ్రాన్‌తో పతకం పన్ని రాజేంద్రనగర్‌ పరిధిలోని పిల్లర్‌ నెంబర్ 248 వద్ద గల హెచ్‌ఎఫ్‌ కన్వెన్షన్ వద్దకు రాత్రి 11గంటల సమయంలో ఖలీల్​ను రప్పించి హత్య చేసి పరారయ్యారని డీసీపీ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details