యదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలో అనుమానాస్పదస్థిలో మృతి చెందిన శ్రీవాణి కేసును పోలీసులు ఛేదించారు. హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేశారు. ఈనెల 18న వలిగొండకు వచ్చిన శ్రీవాణి, అదేరోజు శ్రీవాణి ప్రియుడు మిరియాల రవి పిలవడం వల్ల వలిబాష గుట్ట దగ్గరకు వెళ్లింది. శ్రీవాణిపై అనుమానంతో రవి, స్నేహితుడు రవితేజ సాయం తీసుకున్నాడు.
అత్యాచారం చేసి హత్య చేసిన ప్రేమికుడు - latest crime news in yadadri bhuvanagiri distirct
ప్రేమించిన యువతిని అనుమానంతో ప్రియుడు హత్య చేశాడు. ఆ తర్వాత అనుమానాస్పదస్థితిలో చనిపోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో జరిగింది.
![అత్యాచారం చేసి హత్య చేసిన ప్రేమికుడు అత్యాచారం చేసి హత్య చేసిన ప్రేమికుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8619345-1049-8619345-1598806683206.jpg)
అత్యాచారం చేసి హత్య చేసిన ప్రేమికుడు
వలిబాష గుట్టల్లోని పొదల్లో శ్రీవాణిపై అత్యాచారం చేసి, మెడకు చున్నీతో ఉరి వేసి చంపారని డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. అదే రోజు భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి శివారులో అనుమానాస్పద స్థితిలో ఎ1 మిరియాల రవి మృతి చెందాడు. ఈనెల 29న అనుమానంతో ఎ2 రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, నిజాలు బయటపెట్టాడని డీసీపీ తెలిపారు.