హైదరాబాద్ హయత్‌నగర్‌లోని రాజరాజేశ్వరికాలనీలో ఈ నెల 13న జరిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు చీదర్ల వినయ్, కొండ రాఘవేందర్‌ను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన వినయ్ ఏటీఎంల్లో డబ్బులు జమచేసే ఉద్యోగని ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వినయ్ సెక్యూర్ వాల్యూ కంపెనీలో గత 20 రోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడు.
ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు - latest crime news in hyderabad
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజరాజేశ్వరికాలనీలో ఈ నెల 13న జరిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు చీదర్ల వినయ్, కొండ రాఘవేందర్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.8.95 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
![ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు Police cracked hdfc ATM theft case in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8833479-836-8833479-1600337258915.jpg)
అతని స్నేహితుడు రాఘవేందర్ లాక్డౌన్ నుంచి ఖాళీగా తిరుగుతున్నాడు. అక్రమంగా డబ్బు సంపాదించాలని పథకం వేసి వినయ్‌కి చెప్పాడు. ఇద్దరు కలిసి ఏటీఎంలో డబ్బులు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 11న డ్యూటీలో భాగంగా వినయ్ హయత్‌నగర్ రాజరాజేశ్వరికాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో 13 లక్షల నగదు పెట్టి వెళ్లాడు. అనంతరం రాఘవేందర్కి సేఫ్ పాస్వర్డ్ చెప్పగా.. 13న ఏటీఎంలోకి వెళ్లిన రాఘవేందర్ సేఫ్ పాస్‌వర్డ్‌తో ఉపయోగించి 9 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకున్నారు.
ఇదీ చదవండి: పాత కక్షల నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్య