తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వరద నీటిలో నగలు మాయం.. నాగర్‌కర్నూల్‌లో లభ్యం - glod missed in flood hyderabad

వరద నీటిలో నగల బ్యాగ్‌ మాయం.. నాగర్‌కర్నూల్‌లో లభ్యం
వరద నీటిలో నగల బ్యాగ్‌ మాయం.. నాగర్‌కర్నూల్‌లో లభ్యం

By

Published : Oct 22, 2020, 3:14 PM IST

Updated : Oct 22, 2020, 8:23 PM IST

15:05 October 22

వరద నీటిలో నగలు మాయం.. నాగర్‌కర్నూల్‌లో లభ్యం

వరద నీటిలో నగల బ్యాగ్‌ మాయం.. నాగర్‌కర్నూల్‌లో లభ్యం

బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ జూవెల్లరీ షాపులో పనిచేసే ప్రదీప్‌.. ఈ నెల 9న నగలతో బైక్‌పై బషీర్‌బాగ్‌ వెళ్తుండగా.....అదుపుతప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో భారీ వర్షం పడినందున నగలు నీటిలో కొంతదూరం కొట్టుకుపోయాయి. అక్కడే ఉన్న నిరంజన్‌ అనే వ్యక్తి మెల్లగా నగలు తీసుకుని జారుకున్నాడు. బంగారం పోయిందని బాధితుడు అరుస్తుంటే...అతన్ని దారిమళ్లించి మరీ నగలు కాజేశాడు.  

వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా..పోలీసులు అతన్నే అనుమానించారు. అయితే ఫిర్యాదులో  ప్రదీప్ చరవాణి కూడా పోయిందని చెప్పగా. ఆ సెల్​ఫోన్​ను పోలీసులు ట్రాకింగ్‌లో పెట్టారు. ఫోన్‌ను దొంగింలించిన నిరంజన్‌...దానిని రిపేర్‌ కోసం షాపులో ఇచ్చాడు. సిగ్నల్‌ ఆధారంగా రిపేర్‌ షాప్‌నకు వెళ్లిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.  

మొత్తం 143తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురి కాగా ప్రస్తుతం 125 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.కోటి రూపాయలు నగలు కాజేసి...చివరకు రూ.పదివేల సెల్​ఫోన్ కోసం ఆశపడి నిందితుడు పోలీసులకు చిక్కాడు.  

సంబంధిత కథనాలు: వరదలో కిలోన్నర బంగారు నగలు గల్లంతు!

Last Updated : Oct 22, 2020, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details