దంత వైద్యుడు హుస్సేన్ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - dental doctor Kidnap case updates
08:12 October 28
దంత వైద్యుడు హుస్సేన్ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్‌లో దంత వైద్యుడి కిడ్నాప్ కేసును ఏపీ అనంతపురం పోలీసులు ఛేదించారు. హైదరాబాద్‌లో దంత వైద్యంతో పాటు స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వైద్యుడు హుస్సేన్‌ను కొందరు దుండగులు బుర్ఖాలో వచ్చి కిడ్నాప్ చేశారు. రాత్రి నుంచే 44వ జాతీయ రహదారిపై కాపలా కాసిన పోలీసులు... రాప్తాడు సమీపంలో కిడ్నాపర్లను నిలువరించారు.
బెంగళూరు వైపు తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకరిని పట్టుకోగా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నట్లు అనంతపురం పోలీసులు వెల్లడించారు. రూ. 10 కోట్లు బిట్ కాయిన్ల రూపంలో ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.