తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆశా కార్యకర్తపై ఎంపీటీసీ భర్త లైంగిక వేధింపులు - లైంగికంగా వేధించినందుకు ఎంపీటీసీ భర్తపై కేసు పార్​ పెల్లి

నిర్మల్‌ జిల్లా పార్‌పెల్లిలో ఆశా కార్యకర్తను ఎంపీటీసీ భర్త లైంగికంగా వేధించాడు. మొదటిసారి నిందితుడి కుటుంబసభ్యులకు విషయం చెప్పగా.. కొన్ని రోజులు వేధించలేదు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో మళ్లీ లైంగిక వాంఛ తీర్చాలని వేధించగా.. విసిగిపోయిన ఆశా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆశా కార్యకర్తపై ఎంపీటీసీ భర్త లైంగిక వేధింపులు
ఆశా కార్యకర్తపై ఎంపీటీసీ భర్త లైంగిక వేధింపులు

By

Published : Sep 22, 2020, 6:41 PM IST

ఆశా కార్యకర్తను ఎంపీటీసీ భర్త లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం పార్​పెల్లిలో చోటుచేసుకుంది. పార్​పెల్లి తండాకు చెందిన మహిళ ఆశా కార్యకర్తగా పనిచేస్తుంది. ఆమెను పార్​పెల్లికి చెందిన ఎంపీటీసీ కల్యాణి భర్త గోవర్ధన్ ప్రతి రోజు రాత్రి, పగలు అని తేడా లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎస్సై యూనుస్‌ అహ్మద్‌ అలీ తెలిపారు.

ఇదే విషయాన్ని ఆమె నిందితుని కుటుంబ సభ్యులకు తెలపగా కొన్ని రోజులు ఫోన్ చేయడం మానేశాడు. మళ్లీ ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ చేసి లైంగిక కోరిక తీర్చాలని వేధించాడు. విసిగిపోయిన బాధితురాలు లక్ష్మణచాంద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై యూనుస్‌.. ఎంపీటీసీ భర్త గోవర్ధన్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:జుంబా డ్యాన్స్​ పేరిట లైంగిక వేధింపులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details