తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య - wife killed husband

రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు.. భర్త ప్రభుత్వ ఉద్యోగి.. ఆనందంగా సాగుతున్న ఆ కుటుంబంలో అక్రమ సంబంధం చిచ్చుపెట్టింది. తాళికట్టి పెళ్లాడిన భర్త బంధాన్ని మరిచిన ఆ ఇల్లాలు ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చింది. పథకం ప్రకారం భర్తను హతమార్చి పోలీసులకు పట్టుపడి కటకటాలపాలైంది. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది.

police chased murder murder mistery in warangal rurul district
ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

By

Published : Sep 24, 2020, 4:29 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ మండలం గేటుపల్లికి చెందిన దుర్యత్ సింగ్ వరంగల్​లో ట్రాఫిక్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య జ్యోతి నెక్కొండ మండల కేంద్రంలో టైలరింగ్ షాపు నిర్వహిస్తుంది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఈ క్రమంలో ఇదే మండలం అప్పల్​రావుపేటకు చెందిన జిల్ల రాజుతో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడం వల్ల ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవని, ఈక్రమంలో దుర్యత్ సింగ్ కనపడకపోవడం వల్ల కుటుంబం సభ్యులు మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు విచారణ చేపట్టిన గంటల్లోనే దుర్యత్ సింగ్​ను హతమార్చినట్లు తేల్చారు.

విషయం కుటుంబ సభ్యులకు తెలియడం వల్ల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు దుర్యత్​ సింగ్​ కుటుంబ సభ్యులతో మాట్లాడి శాంతింప చేశారు. దుర్యత్ సింగ్​ను అతని భార్య ఉద్దేశ్య పూర్వకంగానే హత్యచేసినట్లు పోలీసులు వెల్లడించారు. మంగళవారం కేసును ఛేదించినట్లు తెలిపారు. జ్యోతి, రాజు ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. ఇల్లాలి దుర్బుద్ధి కారణంగా తండ్రి హత్యకు గురికాగా.. తల్లి జైలు పాలు కావడంతో చివరకు ఇద్దరు పిల్లల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది.

ఇవీ చూడండి: వివాహేతర బంధానికి బలైన హోంగార్డ్

ABOUT THE AUTHOR

...view details