తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బాలుడు వినయ్ అదృశ్యం ఘటన సుఖాంతం.. కిడ్నాప్​ పేరిట డ్రామా - గుంటూరులో బాలుడి అదృశ్యం ఘటన

ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం అదృశ్యమైన వస్త్ర వ్యాపారి వెంకటేశ్వర్లు కుమారుడు వినయ్​ ఆచూకీ లభ్యమైంది. సత్తెనపల్లి-నరసరావుపేట రోడ్డులోని వే బ్రిడ్డ్ వద్ద వినయ్ క్షేమంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి అదృశ్యం వెనక మిస్టరీపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

బాలుడు వినయ్ అదృశ్యం ఘటన సుఖాంతం..కిడ్నాప్​ పేరిట డ్రామా
బాలుడు వినయ్ అదృశ్యం ఘటన సుఖాంతం..కిడ్నాప్​ పేరిట డ్రామా

By

Published : Nov 17, 2020, 11:03 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం అదృశ్యమైన 13 ఏళ్ల బాలుడు వినయ్ కథ సుఖాంతమైంది. సత్తెనపల్లి-నరసరావుపేట రోడ్డులోని వే బ్రిడ్డ్ వద్ద వినయ్ క్షేమంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి అదృశ్యం వెనక మిస్టరీపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఏం జరిగిందంటే...

సత్తెనపల్లికి చెందిన వెంకటేశ్వర్లు అనే వస్త్రవ్యాపారి కుమారుడు వినయ్ సోమవారం నుంచి కనిపించకుండా పోయాడు. నిన్న రాత్రి అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ అబ్బాయి మా వద్దే ఉన్నాడని...రూ.10లక్షలు ఇస్తే వదిలేస్తామని బెదిరించారు. బయపడిన వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన వ్యక్తులు తర్వాత రూ.50 వేలకు.. చివరకు రూ.10 వేలకు దిగి వచ్చారు. పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో నాటకీయ పరిణామాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఇది ఎవరో చేసిన కిడ్నాప్ కాదని...వినయ్ స్వయంగా స్నేహితుల సాయంతో అదృశ్యమైనట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్​లో ఉన్న వినయ్​ను పోలీసులు విచారిస్తున్నారు.

ఇదీచదవండి:రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడికి తీవ్రగాయాలు

ABOUT THE AUTHOR

...view details