తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

హుజూర్​నగర్​లో అక్రమ గుట్కా వ్యాపారం గుట్టు రట్టు - సూర్యాపేట జిల్లా నేర వార్తలు

హుజూర్​నగర్​లో అక్రమంగా గుట్కా వ్యాపారం నిర్వహిస్తోన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.30వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

police caught illegal gutka in huzurnagar suryapet district
హుజూర్​నగర్​లో అక్రమ గుట్కా వ్యాపారం గుట్టు రట్టు

By

Published : Oct 4, 2020, 11:43 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో అక్రమంగా గుట్కా వ్యాపారం నిర్వహిస్తోన్న వ్యక్తి ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.30వేల విలువ గల గుట్కాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీనివాస థియేటర్ సమీపంలోని షేక్ మగబుల్ ఇంట్లో తనిఖీ నిర్వహించారు.

రెండు బస్తాలలో ఉన్న అంబర్, బ్లూ బుల్ పొగాకు ప్యాకెట్లు బయటకు పారవేస్తుండగా పట్టుకున్నారు. 250 అంబర్ ప్యాకెట్లు, 675 బ్లూ బుల్ పొగాకు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:రోడ్డు పక్కన పసికందు: ఆడ పిల్లనా.. అనారోగ్యమనా?

ABOUT THE AUTHOR

...view details