వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా రేషన్ బియ్యం దందాను కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీఐ రవిరాజు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సోదాల్లో ట్రేడర్స్ బియ్యంతో పాటు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.
అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 500 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం - police inspection at ricemill in kamalapur
గుట్టుచప్పుడు కాకుండా రేషన్ బియ్యం దందాను కొనసాగిస్తున్న మిల్లుుపై పోలీసులు తనిఖీ చేపట్టి దాదాపు 500 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్న ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో జరిగింది. వీటితో పాటు రెండు లారీలు, ఓ ఆటో ట్రాలీను పోలీసులు పట్టుకున్నారు.
చుట్టుపక్కల గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గ్రామీణుల వద్ద తక్కువ ధరకు సేకరించి రీసైక్లింగ్ తర్వాత ఇతర ప్రాంతాలకు తరలించి ఎక్కువ ధరకు విక్రయిస్తారన్నారు. బియ్యాన్ని రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన రెండు లారీలు, ఒక ట్రాలీ ఆటోను పోలీసులు పట్టుకున్నారు. వీటితో పాటు 500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వెనుక ఎవరెవరు ఉన్నారనేది విచారిస్తున్నామని.. నిందితులపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండిఃజిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు