నిర్మాణంలో ఉన్న భవనంలో పేకాట ఆడుతున్న పేకాటరాయుళ్లపై దాడి చేసి.. అరెస్టు చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల తిరుమల నర్సింగ్ హోమ్ ముందు కొత్తగా నిర్మిస్తున్న భవనంలో కొంతమంది పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు నిజామాబాద్ వన్‌టౌన్ సీఐ ఆంజనేయులు, ఎస్సై సాయినాథ్ ఆధ్వర్యంలో దాడి చేశారు. పేకాట ఆడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.62 వేల స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
నిర్మాణంలో ఉన్న భవనంలో పేకాట.. అరెస్టు చేసిన పోలీసులు! - పేకాట రాయుళ్ల అరెస్ట్
నిజాామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న భవనంలో కొంతమంది పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పట్టణ పోలీసులు దాడులు చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. రూ.62 వేలు స్వాధీనం చేసుకున్నారు.
నిర్మాణంలో ఉన్న భవనంలో పేకాట.. అరెస్టు చేసిన పోలీసులు!