డర్టీ హరి చిత్రాన్ని విడుదల చేయొద్దని కోరుతూ భాజపా మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నిచింది. అసెంబ్లీ వద్ద రోడ్డుపై బైఠాయించి... ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో రవీంద్రభారతి, బంగారు మైసమ్మ దేవాలయం, గన్ పార్క్ ముందు మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తితో పాటు పలువురు మహిళా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
భాజపా మహిళా మోర్చా నాయకులు అరెస్ట్! - తెలంగాణ వార్తలు
డర్టీ హరి చిత్రాన్ని విడుదల చేయొద్దని డిమాండ్ చేస్తూ భాజపా మహిళా మోర్చా అసెంబ్లీ ఎదుట ఆందోళనకి దిగింది. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తితో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
భాజపా మహిళా మోర్చా నాయకులు అరెస్ట్
ఆ సినిమా విడుదలను ఆపివేయాలని నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అరెస్టు చేయడంపై మోర్చా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే డర్టీ హరి చిత్రాన్ని విడుదల చేయొద్దని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:గర్భవతి అని చూడకుండా కోడలిని హింసించిన అత్త!