ఆన్లైన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక జయభారత్ నగర్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి.. నిందితులను అరెస్టు చేశారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్టు.. నగదు స్వాధీనం - క్రికెట్ బెట్టింగ్
ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు దాడులు చేసిన పోలీసులు నిందితుల నుంచి.. ల్యాప్‌టాప్, సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్టు.. నగదు స్వాధీనం
డఫ్పా బైట్ ఆన్లైన్ యాప్ ద్వారా ఆచంట వెంకట కృష్ణప్రసాద్, యాడిదల శ్రీను వెంకటేశ్వర రావు.. ల్యాప్‌టాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసుల దాడిలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వీరివద్ద ల్యాప్‌టాప్, 3 ఫోన్లు, రూ.84 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చూడండి:హోం మంత్రి సమక్షంలోనే తెరాస నేతల బాహాబాహీ