యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మండల కేంద్రం నుంచి గుండాల రహదారి వెంట గల సర్వే నెంబరు 215, 216, 226, 230 నెంబర్లలోని 37.13 ఎకరాల భూమిని మోత్కురులో నివాసం ఉంటున్న కట్టెకోల అశోక్ అనే వ్యక్తికి భూ యజమాని పులసాని అరవింద్ రెడ్డి.. 50 లక్షల రూపాయలకు అమ్మినట్లు, అందుకు గానూ.. రూ. 40లక్షలు బయానాగా ఇచ్చినట్లు ఇద్దరు సాక్షుల సంతకాలతో కూడిన ఒప్పందపత్రం తయారు చేశాడు.
నకిలీ అమ్మకపు పత్రాలు సృష్టించిన వ్యక్తి అరెస్టు.. కేసు నమోదు
భూమి అమ్మిన వ్యక్తికి డబ్బులు ఇవ్వకముందే ఇచ్చినట్టు నకిలీ ఒప్పంద పత్రాలు సృష్టించి మోసం చేసిన వ్యక్తిని యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఫోర్జరీ సంతకాలు చేసి.. మోసం చేసిన నేరం కింద నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
భూయజమాని సంతకాన్ని ఫోర్జరీ చేసి అమ్మకపు ఒప్పందం ప్రత్రాన్ని సృష్టించి.. భూమి తనకే చెందుతుందని కోర్టును ఆశ్రయించాడు. విషయం తెలుసుకొన్న భూ యజమాని అరవింద్ రెడ్డి సదరు వ్యక్తి పై రెండు నెలల క్రితం మోత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు ఆ ఇద్దరు సాక్షులను విచారించగా అమ్మకపు ఒప్పందం పత్రంపై భూ యజమాని సంతకం ఫోర్జరీ అయినట్లు గుర్తించి దొంగ ధృవీకరణ పత్రాలను సృష్టించిన కట్టెకోల అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. 2018లోనూ అశోక్‌పై ఫోర్జరీ కేసు నమోదు అయినట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు.
ఇదీ చదవండి :దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం